kajal: 'సీత' సినిమా ఆడవాళ్లకే బాగా నచ్చుతుందని నా అభిప్రాయం: దర్శకుడు తేజ
- కథను కొత్తగా చెప్పేందుకు ట్రై చేశాను
- కాజల్ పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంది
- హిట్ అవుతుందనే నమ్మకం వుంది
తేజ సినిమాలో ఏదో ఒక కొత్తదనం వుంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో వుంది. ఈ కారణంగానే ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆత్రుతను కనబరుస్తారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'సీత' .. ఈ నెల 24వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో తేజ మాట్లాడాడు.
"రాముడు .. సీత .. రావణాసురుడు కథే ఇది. అయితే ఆ కథను కొత్తగా చెప్పడానికి ప్రయత్నించాము. ఈ సినిమాలో పురుషాధిక్య ప్రపంచాన్ని ఎదుర్కొని కాజల్ ఎలా సక్సెస్ ను సాధిస్తుందనే విషయం చుట్టూ కథ తిరుగుతుంది. అందువలన ఈ సినిమా మగాళ్లకంటే కూడా ఆడవాళ్లకి బాగా నచ్చుతుందేమోనని అనుకుంటున్నాను. కథపై నాకు పూర్తి నమ్మకం వుంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.