abcari: కౌంటింగ్ సందర్భంగా రేపు మద్యం షాపులకు తాళాలు
- ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఆబ్కారీ శాఖ ఆదేశాలు
- ఫలితాల అనంతరం ఎటువంటి ఉద్రిక్తతలకు అవకాశం ఇవ్వకూడదని
- గురువారం ఉదయం 6 నుంచి శుక్రవారం ఉదయం 6 వరకు మూత
మందుబాబులకు కొంచెం ఇబ్బందికర వార్త. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాలు, బార్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని, అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సాధారణంగా ఫలితాల అనంతరం విజేతలు సంబరాల్లో మునిగితేలుతారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది.