Ghaziabad: ఐదు లక్షల పైచిలుకు ఓట్లతో గెలుపొందిన ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్
- గత ఎన్నికల్లో 5.67 లక్షల రికార్డు మెజారిటీ
- ఈసారి కూడా ఐదు లక్షల మార్కును దాటిన వైనం
- ఘజియాబాద్‌ను క్లీన్ సిటీగా మారుస్తానని హామీ
ఆర్మీ మాజీ చీఫ్, కేంద్రమంత్రి వీకే సింగ్ మరోమారు భారీ విజయాన్ని అందుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ నుంచి పోటీ చేసిన ఆయన ఏకంగా 5,01,500 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వీకే సింగ్‌కు పోటీగా బరిలో నిలిచిన సమాజ్‌వాదీ పార్టీ నేత సురేశ్ బన్సల్ ఏ దశలోనూ వీకే సింగ్‌కు పోటీ ఇవ్వలేకపోయారు. 2014లో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన వీకే సింగ్ అప్పట్లో 5.67 లక్షల రికార్డు మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు కూడా ఐదు లక్షల మెజారిటీ మార్కును చేరుకున్నారు. గెలుపు అనంతరం సింగ్ మాట్లాడుతూ.. పౌరులు, మీడియా సహకారంతో ఘజియాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.