Surath: సూరత్ అగ్ని ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డాను: మోదీ

  • మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి
  • గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి
  • సహాయక చర్యలందించాలని సూచించా

సూరత్ నగరంలో సర్తానా ప్రాంతంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 15 మంది విద్యార్థులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘సూరత్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం గురించి విని చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భావిస్తున్నారు.

తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని తగిన సహాయక చర్యలు తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని, స్థానిక అధికారులకు సూచించా’’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు ఘటనపై గుజరాత్ సీఎంవో కూడా స్పందించింది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం విజయ్ రూపానీ ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించింది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

  • Loading...

More Telugu News