devisri prasad: విమర్శల కారణంగా దేవిశ్రీ ప్రసాద్ ఆ నిర్ణయం తీసేసుకున్నాడట
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీకి మంచి పేరు
- హుషారైన బాణీలు ఇవ్వడం ఆయన ప్రత్యేకత
- స్టార్ హీరోల సినిమాలకే ప్రాధాన్యత
తెలుగు పాటను పరుగులు తీయించే సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ కి మంచి క్రేజ్ వుంది. ఒక వైపున యూత్ ను హుషారెత్తించే ఆయన, మరో వైపున మాస్ ఆడియన్స్ మనసులను కూడా దోచేస్తుంటాడు. అలాంటి దేవిశ్రీ సంగీతంలో ఈ మధ్య జోరు తగ్గిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన 'వినయ విధేయ రామా' సినిమాకి .. ఇటీవల వచ్చిన 'మహర్షి' సినిమాకి స్వరపరిచిన బాణీల్లో అంతగా పసలేదనే విమర్శలు వినిపించాయి.
ఈ విషయంపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ నడించింది. దాంతో దేవిశ్రీ ప్రసాద్ ఆలోచనలో పడినట్టుగా చెప్పుకున్నారు. ఎక్కువ ప్రాజెక్టులు ఒప్పుకోవడం వలన, హీరోల సినిమాల నుంచి అభిమానులు ఆశించే సంగీతాన్ని అందించలేకపోతున్నానని దేవిశ్రీ ప్రసాద్ భావించాడట. అందువలన సినిమాల సంఖ్యను తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ఇక పై స్టార్ హీరోల సినిమాలను మాత్రమే చేస్తాడేమోననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.