YSRCP LP: వైఎస్సార్ సీపీ శాసన సభా పక్షం భేటీ.. సరిగ్గా 10.31 గంటలకు ప్రారంభం
- తాడేపల్లిలో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యేలు
- జగన్‌ను వైసీపీ ఎల్పీ సభ్యుడిగా ఎన్నుకోనున్న సభ్యులు
- సాయంత్రం గవర్నర్‌కు దీన్ని సమర్పించనున్న నేతలు
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న తర్వాత ఈరోజు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాయంలో వైసీపీ శాసన సభా పక్షం భేటీ ప్రారంభమైంది. ఈ సమావేశంలో పార్టీ అధినేత జగన్‌ను తమ నాయకుడిగా ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. సరిగ్గా 10.31 గంటలకు సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశానికి వైసీపీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్యనేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్బంగా జగన్‌ను వైసీపీ ఎల్పీ లీడర్‌గా ఎన్నుకుంటారు. అనంతరం ఈరోజు సాయంత్రం ఈ తీర్మానాన్ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌కు జగన్ అందజేయనున్నారు. కాగా, గెలుపు తర్వాత జరిగిన తొలి సమావేశం కావడంతో జగన్ క్యాంపు కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. సమావేశానికి గంట ముందే పలువురు ప్రజాప్రతినిధులు కార్యాలయానికి చేరుకోవడంతో హడావుడి కనిపించింది.