Rahul Gandhi: రాహుల్ కనుక రాజీనామా చేస్తే.. బీజేపీ ట్రాప్‌లో చిక్కుకున్నట్టే: ప్రియాంక గాంధీ

  • సార్వత్రిక ఎన్నికల్లో ఓటమికి రాహుల్ నైతిక బాధ్యత
  • కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన
  • అలా చేస్తే బీజేపీ గెలిచినట్టు అవుతుందన్న ప్రియాంక

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు రాహుల్ గాంధీ ముందుకొచ్చారు. అయితే, సోనియా గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్లు అందరూ వారించారు. అధ్యక్ష పదవికి రాహులే సరైన వ్యక్తి అని, ఆ స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని శనివారం జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్, చిదంబరం తదితరులు పేర్కొన్నారు. అంతేకాదు, రాహుల్ కనుక అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే కార్యకర్తలు ఆత్మహత్య చేసుకుంటారని పేర్కొన్నారు.

మరోవైపు, తన సోదరుడి రాజీనామా వార్తలపై ప్రియాంక గాంధీ స్పందించారు. రాహుల్ కనుక రాజీనామా చేస్తే బీజేపీ ట్రాప్‌లో పడినట్టే అవుతుందని పేర్కొన్నారు. రాహుల్ అధ్యక్ష పదవిలో కొనసాగాల్సిందేనని అన్నారు.

సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించగా నేతలు సుతిమెత్తగా తోసిపుచ్చారు. రాహుల్ రాజీనామాను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ రాహుల్‌కు ఉందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News