Son: అత్త కాదు అమ్మే... కొడుకు మరణిస్తే, దగ్గరుండి కోడలికి మరో వివాహం!

  • కొడుకు మృతితో ఒంటరైన కోడలు
  • సంప్రదాయవాదులు కాదన్నా మరో వివాహం
  • ఆదర్శప్రాయంగా నిలిచిన మహిళ

తాను అత్తను కాదని, అమ్మనేనని రుజువు చేస్తూ, విధవరాలైన కోడలి పాలిట దైవంలా నిలిచిందో మహిళ. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమైన ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే, ఛత్తీస్‌ గఢ్‌ లోని హీరాపూర్‌ కు చెందిన చంపాబాయీ చిన్నతనంలోనే వివాహం కాగా, ఓ కొడుకు పుట్టిన తరువాత భర్తను కోల్పోయింది. కొడుకే లోకంగా పెరిగిన ఆమె, ఓ మంచి అమ్మాయిని చూసి కుమారుడికి వివాహం జరిపించి, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న వేళ, విధి మరోలా వెక్కిరించింది.

ఒక్కగానొక్క కొడుకు రెండేళ్ల క్రితం హఠాత్తుగా మరణించడంతో, ఇంట్లో హీరాబాయి, ఆమె కోడలు జ్ఞానేశ్వరి మాత్రమే మిగిలారు. తాను పడిన కష్టాలనే తన కోడలు పడరాదని భావించిన హీరాభాయి, కోడలికి మరో వివాహం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలు, ఆమె సంప్రదాయ విరుద్ధంగా వ్యవహరిస్తోందని బెదిరింపులకు దిగారు. అయినా బెదరని ఆమె, కోడలికి మరో పెళ్లి చేసేందుకు వరుడిని వెతికింది. తమ గ్రామానికి దగ్గర్లోనే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉన్న యువకుడిని గుర్తించి, అతనికి ఇచ్చి వివాహం జరిపించి, అత్తలందరికీ ఆదర్శప్రాయంగా నిలిచింది.

  • Loading...

More Telugu News