Madhya Pradesh: పరీక్షల్లో తేలిపోయిన విద్యార్థులు.. టీచర్లకు పరీక్ష పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం!

  • 10, 12వ తరగతి పరీక్షల్లో విద్యార్థుల్లో చెత్త ప్రదర్శన
  • తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం
  • జూన్ 12న 3500 మంది ఉపాధ్యాయులకు పరీక్ష

పది, పన్నెండో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఫెయిలవడం ఉపాధ్యాయుల పీకల మీదకు వచ్చింది. దాదాపు 30 శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడాన్ని తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమైంది. దాదాపు 700 పాఠశాలల్లోని ఉపాధ్యాయుల నైపుణ్యాలను పరీక్షించాలని భావిస్తోంది. ఇందుకోసం 10, 12వ తరగతి పరీక్షలను పోలిన ఎగ్జామ్ నిర్వహించాలని యోచిస్తోంది.

మే 15న విడుదలైన పది, పన్నెండో తరగతి పరీక్షల్లో 700 స్కూళ్లకు చెందిన విద్యార్థులు చెత్త ప్రదర్శన కనబరిచారు. కేవలం 30 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైంది. రిజల్ట్‌తో అప్రమత్తమైన ప్రభుత్వం మొత్తం 3500 మంది ఉపాధ్యాయుల నైపుణ్యంపై అనుమానాలు వ్యక్తం చేసింది. అందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు జూన్ 12న పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపింది. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉపాధ్యాయులకు గ్రేడ్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ ఈ ఎగ్జామ్‌లో ఉపాధ్యాయులు కనుక అనుత్తీర్ణత సాధిస్తే పెనాల్టీ తప్పదని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రేష్మి అరుణ్ షామి తెలిపారు.

  • Loading...

More Telugu News