raja: అప్పులు తీర్చడానికి చెన్నైలోని ఇంద్రభవనం వంటి ఇల్లును మా నాన్న అమ్మేశారు: కాంతారావు తనయుడు రాజా
- నాన్న వరుస సినిమాలను నిర్మించారు
- సినిమాలు ఆడకపోవడంతో నష్టాలు
- ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది
తెలుగు తెరపై జానపద కథానాయకుడిగా కాంతారావు ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత సొంతంగా సినిమాలను నిర్మించిన ఆయన, చివరిదశలో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని గురించి కాంతారావు తనయుడు రాజా స్పందించారు.
"మా నాన్న సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసి వరుసగా 5 సినిమాలను నిర్మించారు. 5 సినిమాలు కూడా నష్టాలనే తెచ్చిపెట్టాయి. ఫలితంగా ఆస్తులు అమ్మేసి అప్పులు తీర్చవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో చెన్నైలో ఇంద్రభవనం వంటి మా ఇల్లును నాన్న అమ్మేశారు. అంతేకాదు కోదాడ దగ్గర 'గుడిబండ'లో మాకు 80 ఎకరాల పొలం ఉండేది. ఆ పొలాన్ని కూడా నాన్న అమ్మేశారు. అలా ఆస్తులన్నీ పోవడంతో, చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చేశాము" అని చెప్పుకొచ్చారు.