Kumara Swamy: తాతతో గొడవ పడ్డాడంటూ కన్నడ నటుడు నిఖిల్ పై కథనం.. పత్రికపై కేసు నమోదు
- మాండ్య నుంచి పోటీ చేసి ఓడిపోయిన నిఖిల్
- బాగా తాగి తాతను దూషించినట్టు కథనం
- ‘విశ్వవాణి’ ఎడిటర్‌పై కేసు నమోదు
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు, సినీ నటుడు నిఖిల్ ఇటీవల మాండ్య నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థి సుమలత చేతిలో లక్షకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో నిఖిల్ బాగా తాగి పద్మనాభ నగర్‌లోని దేవెగౌడ ఇంటికి వెళ్లి తన తాత దేవెగౌడను దూషించినట్టు కన్నడ డైలీ ‘విశ్వవాణి’లో కథనం ప్రచురితమైంది.
రాజకీయాల్లోకి తీసుకొచ్చి తన కెరియర్‌ను నాశనం చేశారంటూ తన తాతపై నిఖిల్ గొడవకు దిగినట్టు కథనంలో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ‘విశ్వవాణి’ ఎడిటర్ విశ్వేశ్వరభట్‌తో పాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోపక్క, తన కుమారుడిపై వచ్చిన కథనాన్ని సీఎం కుమారస్వామి ఖండించారు. ఆ వార్తల్లో నిజం లేదని, పూర్తిగా కల్పితమని పేర్కొన్నారు.