Naminations: ఎమ్మెల్సీగా నవీన్‌రావు ఒక్కరే నామినేషన్ దాఖలు.. లాంఛనంగా మారిన ఎన్నిక
- నేటితో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ప్రక్రియ
- మైనంపల్లి రాజీనామాతో ఎన్నిక అనివార్యం
- పోటీకి విముఖత చూపిన విపక్షాలు
శాసనమండలిలో ఎమ్మెల్యే కోటా ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగిసింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు శాసనమండలికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఎన్నికల ప్రక్రియ అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో పోటీకి విపక్షాలు విముఖత ప్రదర్శించడంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే అయింది. టీఆర్ఎస్ తరుపున కె. నవీన్‌రావు ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 31న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం నవీన్‌రావు ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు. నామినేషన్ దాఖలు సమయంలో నవీన్‌రావు వెంట టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో పాటు పలువురు మంత్రులు ఉన్నారు.