apsrtc: సమ్మె సైరన్ మోగించిన ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ.. హామీని జగన్ నిలబెట్టుకోవాలని విన్నపం
- జూన్ 13 నుంచి సమ్మె
- 12 నుంచే ఆగిపోనున్న దూరప్రాంత సర్వీసులు
- కార్మికుల డిమాండ్లపై కొత్త ప్రభుత్వం స్పందించాలన్న జేఏసీ
ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధమవుతోంది. జూన్ 13 నుంచి సమ్మెను చేపడుతున్నట్టు జేఏసీ ప్రకటించింది. దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులను 12వ తేదీ నుంచే నిలిపివేస్తున్నట్టు తెలిపింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. సిబ్బంది కుదింపుపై యాజమాన్యం వైఖరిని మార్చుకోవాలని కోరింది. అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారని... ఇచ్చిన హామీని నిలుపుకోవాలని విన్నవించింది.