Narendra Modi: 'నరేంద్ర మోదీ 2.0'... ఆసక్తికర విశేషాలు!
- రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ
- తగ్గిన మహిళా మంత్రుల సంఖ్య
- 20 ఏళ్ల తరువాత అన్నాడీఎంకేకు కేంద్ర మంత్రి పదవి
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 2014లో మోదీ టీమ్ తో పోలిస్తే, ప్రస్తుత టీమ్ ఎన్నో ప్రత్యేకతలను కలిగివుంది.
* దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఏఐఏడీఎంకే ఎంపీకి కేంద్ర కేబినెట్ లో స్థానం లభించింది.
* మంత్రివర్గంలో చోటుదక్కని ప్రముఖుల్లో మనేకాగాంధీ, రాధామోహన్ సింగ్, జయంత్ సిన్హా, అనుప్రియా పటేల్, రామ్ కృపాల్ యాదవ్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్, అనంత్ కుమార్ హెగ్డే తదితరులున్నారు.
* గత కేబినెట్ లో మంత్రులుగా ఉండి ఓడిపోయిన వారిలో మనోజ్ సిన్హా, అల్ఫోన్స్ కన్నంతనమ్, హన్స్ రాజ్ ఆహిర్ లున్నారు.
* గత క్యాబినెట్ లో మంత్రులుగా ఉండి, ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వారిలో సురేష్ ప్రభు, సుష్మా స్వరాజ్, ఉమా భారతి, బీరేంద్ర సింగ్, అరుణ్ జైట్లీలున్నారు.
* ఓడిపోయినప్పటికీ పదవిని దక్కించుకున్న ఎంపీగా హర్దీప్ సింగ్ పురి నిలువగా, గత క్యాబినెట్ లో మంత్రిగా ఉండి టికెట్ ను పొందలేకపోయిన వ్యక్తిగా విజయ్ సంప్లా నిలిచారు.
* గత క్యాబినెట్ లో 8 మంది మహిళలుండగా, ఈ దఫా వారి సంఖ్య 6కు తగ్గింది.
* గరిష్ఠంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన 9 మందికి మంత్రి పదవులు లభించాయి.