Jagan: తొలి జీవో జారీ చేసిన జగన్ ప్రభుత్వం!
- వృద్ధాప్య పెన్షన్ ను పెంచిన జగన్
- ప్రమాణ స్వీకారం తరువాత తొలి సంతకం
- ఈ ఉదయం జీవో జారీ
నవ్యాంధ్రలో కొలువుదీరిన వైఎస్ జగన్ సర్కారు ఈ ఉదయం తన తొలి జీవోను జారీ చేసింది. నిన్న ప్రమాణ స్వీకారోత్సవం తరువాత వయోవృద్ధులకు ఇస్తున్న పెన్షన్ ను రూ. 2 వేల నుంచి రూ. 2,250కి పెంచుతున్నట్టు జగన్ ప్రకటించి, తన తొలి సంతకాన్ని ఆ ఫైల్ పై పెట్టిన సంగతి తెలిసిందే.
దీనికి 'వైఎస్ఆర్ పెన్షన్ కానుక' అని పేరు పెట్టగా, దీనిపై చీఫ్ సెక్రెటరీ జీవోను విడుదల చేశారు. వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేలతో పాటు వయోవృద్ధుల పెన్షన్ వయసును 65 నుంచి 60కి కుదిస్తున్నట్టు జీవోలో పొందు పరిచారు. జూలై 1 నుంచి కొత్త పెన్షన్ పథకం అమలవుతుందని ఇందులో పేర్కొన్నారు.