BJP: జలవనరుల మంత్రిత్వశాఖ పేరును మార్చిన కేంద్రం
- కేంద్ర జల్శక్తిగా పేరు మార్పు
- గజేంద్ర షెఖావత్‌కు జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కేటాయింపు
- ఇకపై జల సంబంధ విషయాలన్నీ ఈ శాఖ పరిధిలోకే..
కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ పేరును కేంద్రం మార్చింది. ఇకపై దీనిని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖగా పిలవనున్నారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రాజస్థాన్‌కు చెందిన గజేంద్ర షెఖావత్‌కు ఈ మంత్రిత్వ శాఖను అప్పగించారు. ఇకపై జలవ్యవహారాలన్నీ ఈ శాఖ కిందికే వస్తాయి. అంతర్జాతీయ జల వివాదాలైనా, దేశీయ జలవివాదాలైనా ఈ శాఖే చూడాల్సి ఉంటుంది. అలాగే, నీటి పారుదల రంగం, నమామి గంగ ప్రాజెక్టు, గ్రామీణ నీటి సరఫరా తదితరాలు కూడా దీనికిందకే రానున్నాయి.
జల్‌శక్తి కింద నదుల అనుసంధానం, తుంపర సేద్యం అమలు, ప్రతి ఇంటికి నల్లా నీరు వంటివి అమలు చేస్తామంటూ ఎన్నికలకు ముందు బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జలవనరుల మంత్రిత్వశాఖ పేరును కేంద్ర జల్శక్తిగా మార్చింది.