jagan: సీఎం జగన్ సంక్షేమ పథకాలు నచ్చాయి...జీతం తీసుకోకుండా పనిచేస్తా : ఎస్ఈ సురేంద్రరెడ్డి
- ఆయన జీతం రూ. 1.65 లక్షలు
- ప్రస్తుతం వంశధార ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలు
- శ్రీకాకుళం జిల్లాలో కీలక సాగునీటి ప్రాజెక్టు ఇది
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలు తనను ఆకర్షించాయని, ఇందుకోసం తనవంతు బాధ్యతగా ఆయన ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో జీతం తీసుకోకుండా పనిచేయానుకుంటున్నానని వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్ఈ) ఎం.సురేంద్రరెడ్డి సర్కారు అనుమతి కోరారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార రిజర్వాయర్ అతిపెద్ద సాగునీటి ప్రాజెక్టు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న సురేంద్రరెడ్డి నెలకు గరిష్టంగా 1,65,734 రూపాయల జీతం పొందుతున్నారు. అన్ని కటింగ్లు పోను నెలకు ఆయనకు నికరంగా 94,294 రూపాయలు చేతికి అందుతోంది.
అయితే ఇంత పెద్దమొత్తం జీతం వదులుకునేందుకు ఆయన సిద్ధపడ్డారు. జగన్ అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలు నచ్చి ఈ నిర్ణయం తీసుకున్నానని, ఒకవేళ జీతం తీసుకోకుండా పనిచేయడానికి నిబంధనలు అంగీకరించకుంటే ఒక రూపాయి జీతం తీసుకుని పనిచేసేందుకైనా అనుమతించాలని ఆయన కోరారు.