Father: కుమారుడికి వచ్చిన లెటర్ చదివినందుకు రెండేళ్ల జైలుశిక్ష!
- లెటర్ లో తండ్రిపై ఆరోపణలు చేసిన తల్లి తరఫు బంధువులు
- దాన్ని తీసుకుని కోర్టుకు ఎక్కిన తండ్రి
- వేరేవారి లెటర్ ఎందుకు చదివారని ప్రశ్నించిన న్యాయమూర్తి
తన కుమారుడికి వచ్చిన లెటర్ ను చదవడంతో పాటు, దాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నించిన ఓ తండ్రికి స్పెయిన్ కోర్టు రెండేళ్ల జైలుశిక్షను విధించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, సెవిల్లే ప్రాంతంలో ఉన్న ఓ వ్యక్తికి పదేళ్ల కుమారుడు ఉండగా, అతనికి తల్లి తరఫు బంధువుల నుంచి ఓ లేఖ వచ్చింది. అతని తండ్రి దాన్ని తెరిచి చదివాడు. బాలుడికి రాసిన లేఖలో తండ్రిపై ఉన్న గృహహింస కేసుకు సంబంధించిన వివరాలను ఆమె ఆరా తీసింది. అతను చేసిన తప్పులు ఎత్తిచూపుతూ విమర్శించింది. దీన్ని చూసిన అతను, కోర్టుకు వెళ్లి భార్య తరఫు బంధువులు తనను మానసికంగా వేధిస్తున్నారని, కావాలనే కేసులు పెట్టారని, దానికి సాక్ష్యమే ఈ లేఖని వాదించాడు. ఆసలు వేరే వారికి వచ్చిన లేఖను ఎందుకు చదవాల్సి వచ్చిందన్న న్యాయమూర్తి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోయాడు. బాలుడి గోప్యతకు తండ్రే భంగం కలిగించారని భార్య తరఫు లాయర్లు చేసిన వాదనను పరిగణన లోకి తీసుకున్న న్యాయస్థానం, అతనికి రెండేళ్ల జైలు శిక్షను, జరిమానాను విధిస్తున్నట్టు ప్రకటించింది.