Secunderabad: సికింద్రాబాద్ రైల్వే ఫార్మా విభాగంలో కోట్లు స్వాహా

  • సీబీఐకి ఫిర్యాదు చేసిన రైల్వే విజిలెన్స్ విభాగం
  • రూ.2.20 కోట్లు స్వాహా చేసినట్టు విచారణలో వెల్లడి
  • 31 నకిలీ ఫార్మా బిల్లులు సృష్టించినట్టు స్పష్టం

సికింద్రాబాద్ రైల్వే విభాగంలో అధికారులు ఫార్మా ఏజెన్సీలతో కలిసి పోయి నకిలీ బిల్లులు సృష్టించి కోట్లు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంపై రైల్వే విజిలెన్స్ విభాగం సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఎంక్వైరీ చేసిన సీబీఐ అధికారులకు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

నకిలీ బిల్లులు సృష్టించి రూ.2.20 కోట్లు స్వాహా చేసినట్టు అధికారుల దృష్టికి వచ్చింది. రైల్వేశాఖలో గతేడాది అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య 31 నకిలీ ఫార్మా బిల్లులు సృష్టించినట్టు విచారణలో తేలింది. ఈ కుంభకోణానికి సంబంధించి రైల్వే అకౌంట్స్ విభాగానికి చెందిన సాయి బాలాజీ, గణేష్ కుమార్, వినాయక ఏజెన్సీస్, తిరుమల ఎంటర్ ప్రైజెస్‌పై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News