indian: 13 మందితో బయల్దేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం మిస్సింగ్
- అరుణాచల్ ప్రదేశ్ లోని మేచుకాకు వెళ్తుండగా మిస్సింగ్
- విమానంలో క్రూ మెంబర్స్ తో పాటు 13 మంది ప్రయాణం
- ఒంటి గంట సమయంలో గ్రౌండ్ స్టేషన్ తో కోల్పోయిన సంబంధాలు
భారత వాయుసేనకు చెందిన విమానం మిస్ అయినట్టు సమాచారం అందుతోంది. ఈ విమానంలో 8 మంది క్రూ మెంబర్స్ తో పాటు మరో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. మధ్యాహ్నం 12.25 గంటలకు ఏఎన్-32 ఎయిర్ క్రాఫ్ట్ అస్సామ్ లోని జోర్హట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని మేచుకాకు బయల్దేరింది. ఒంటి గంట సమయంలో గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలను కోల్పోయింది. విమానం ఆచూకీ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.