Swiggi: ఇకపై ఇంటి భోజనాన్ని మరపించే ఆహారాన్ని అందించనున్న స్విగ్గీ

  • స్విగ్గీ డైలీ పేరుతో నూతన యాప్
  • గురుగ్రామ్‌లో తొలుత ప్రారంభించిన స్విగ్గీ
  • ముంబయి, బెంగళూరుకు విస్తరించనుంది
  ఇంటి భోజనానికి సాటి వేరేది రాదనే వారికోసం ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ, ‘స్విగ్గీ డైలీ’ పేరుతో ఒక నూతన యాప్‌ను తన వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పూర్తి ఇంటి వాతావరణంలో తయారు చేసిన భోజనాన్ని వినియోగదారులకు స్విగ్గీ అందించనుంది. దీనికోసం ఆర్గనైజ్డ్ వెండర్స్, హోం చెఫ్స్ సాయంతో భోజనాన్ని స్విగ్గీ డైలీ ద్వారా అందిస్తున్నామని సంస్థ సీఈవో శ్రీహర్ష తెలిపారు. ప్రస్తుతం దీనిని గురుగ్రామ్‌లో ప్రారంభించారు. త్వరలోనే ముంబయి, బెంగళూరు నగరాలకు విస్తరించనున్నారు.
Swiggi
Swiggi Daily
Home Food
Bengalore
Gurugram
Mumbai
Sri Harsha

More Telugu News