AC Coach: తెలుగు రాష్ట్రాల్లో పది ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు ఏసీ కోచ్ లు... వివరాలు!

  • నారాయణాద్రి, వెంకటాద్రి రైళ్లకు ఏసీ బోగీలు
  • గౌతమి, దేవగిరి, సింహపురి ఎక్స్ ప్రెస్ లకు కూడా
  • వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే

తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరి వెళ్లే పది ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా ఏసీ కోచ్ లను శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దూరప్రాంత ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని కొత్త ఏసీ 3 టైర్ బోగీలను కలపనున్నామని సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ సీహెచ్ రాకేశ్ వెల్లడించారు. అక్టోబర్ 1 నుంచి లింగంపల్లి నుంచి తిరుపతి మధ్య తిరిగే నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ కు, సికింద్రాబాద్ నుంచి గూడూరు మధ్య తిరిగే సింహపురి ఎక్స్ ప్రెస్ కు ఏసీ బోగీ కలుస్తుందని తెలిపారు. సికింద్రాబాద్- ముంబై మధ్య తిరిగే దేవగిరి ఎక్స్ ప్రెస్ కు అక్టోబర్ 3వ తేదీన, కాచిగూడ- చిత్తూరు మధ్య తిరిగే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కు అక్టోబర్ 1వ తేదీన, కాకినాడ పోర్ట్ నుంచి లింగంపల్లి వరకూ తిరిగే గౌతమి ఎక్స్ ప్రెస్ కు అదే రోజున ఏసీ బోగీలను కలపనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News