India: ఫ్రాన్స్ దేశంలో భారతీయుడు హత్యకు గురైతే ఒక సిగరెట్ లైటర్ ఎలా సాయపడిందో చూడండి!

  • సంచిలో దొరికిన మృతదేహం
  • లైటర్ పై పేరు ఆధారంగా మరో దేశానికి మారిన క్రైమ్ సీన్
  • సహచరుడే హంతకుడని భావిస్తున్న పోలీసులు

గత సంవత్సరం ఫ్రాన్స్ లోని బార్బర్గ్ పట్టణంలో కుళ్లినస్థితిలో ఉన్న ఓ మృతదేహం లభించింది. ఓ పారిశుద్ధ్య కార్మికుడు విధి నిర్వహణలో ఉండగా పెద్ద సంచిలో ఈ మృతదేహాన్ని గుర్తించాడు. సమాచారం అందుకున్న పోలీసులకు ఆ కేసు ఓ సవాల్ గా పరిణమించింది. మృతదేహం ఆనవాళ్లు కూడా పోల్చుకోలేని విధంగా ఉండడంతో ఆ చిక్కుముడి విప్పడంలో ఇబ్బందులుపడ్డారు. అయితే, శవం దొరికిన చోట ఓ సిగరెట్ లైటర్ కూడా లభ్యమైంది. దానిపై క్రోయెగ్ కేఫ్ అని రాసి ఉండడంతో అదేమైనా ఉపయోగపడుతుందేమోనని దాన్ని భద్రపరిచారు.

క్రోయెగ్ కేఫ్ అనేది యూరప్ లోని పలు దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన పబ్ ఫ్రాంచైజీ. ముఖ్యంగా, హాలెండ్, బెల్జియం దేశాల్లో క్రోయెగ్ కేఫ్ పబ్ లు చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, బెల్జియం పోలీసులకు ఫ్రెంచ్ దర్యాప్తు అధికారులు ఈ కేసు విషయం వివరించారు.  అప్పటికే బెల్జియంలో దర్శన్ సింగ్ అనే భారతీయుడు అదృశ్యం అయినట్టు కేసు నమోదైంది. దర్శన్ సింగ్ నివాసానికి దగ్గర్లోనే క్రోయెగ్ కేఫ్ పబ్ ఉండడంతో పోలీసులకు కేసు పురోగతిపై నమ్మకం కుదిరింది. దర్శన్ సింగ్ తో కలిసి నివాసం ఉంటున్న మరో భారతీయుడే హత్య చేసి ఉంటాడని బెల్జియం పోలీసులు భావించారు.

దర్శన్ సింగ్ టూత్ బ్రష్ పై లభ్యమైన డీఎన్ఏ నమూనాలతో, ఫ్రాన్స్ లో దొరికిన మృతదేహం డీఎన్ఏ సరిపోలడంతో చనిపోయింది దర్శన్ సింగేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాంతో, అతడి సహచరుడి కోసం గాలింపు ముమ్మరం చేశారు.

  • Loading...

More Telugu News