BSE: స్టాక్ మార్కెట్ల జోరుకు ఇవాళ బ్రేకులు!
- నష్టాలతో ముగిసిన మార్కెట్లు
- లాభాల స్వీకరణకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- భారీగా నష్టపోయిన హీరోమోటోకార్ప్, బజాజ్ ఆటో షేర్లు
గత కొన్నిరోజులుగా ఉత్సాహవంతమైన వాతావరణంలో ట్రేడింగ్ కొనసాగించిన భారత స్టాక్ మార్కెట్లు నేడు డీలాపడ్డాయి. ఇన్వెస్టర్లు ఇవాళ లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లకు నష్టాలు తప్పలేదు. బీఎస్ఈ సెన్సెక్స్ 184 పాయింట్లు నష్టపోయి 40,083 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో 12,021 వద్ద ముగిసింది. జీ ఎంటర్టయిన్ మెంట్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, హెచ్ సీఎల్ టెక్, టీసీఎస్ నష్టాలు చవిచూశాయి. ఎస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, వేదాంత షేర్లు లాభాల బాటలో పయనించాయి.