Andhra Pradesh: 12 నుంచి ఏపీ అసెంబ్లీ... ప్రొటెం స్పీకర్ గా చిన అప్పలనాయుడు?

  • బొబ్బిలి నుంచి గెలిచిన సంబంగి
  • ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్న ప్రొటెం స్పీకర్
  • ఆ తరువాత స్పీకర్ ఎన్నిక
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకన్నా ముందే ప్రొటెం స్పీకర్ గా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన అప్పలనాయుడిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 12న అసెంబ్లీ ప్రారంభమైన తరువాత, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.

ఇక అంతకుముందే మంత్రివర్గం కూడా ఏర్పాటు కానుందని పార్టీ నేతలు అంటున్నారు. ఆపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలివున్న 9 నెలల కాలానికీ కొత్తగా బాధ్యతలు స్వీకరించే ఆర్థికమంత్రి బడ్జెట్ ను సమర్పిస్తారు. ఇక తొలి సమావేశాల్లోనే బడ్జెట్ ఉంటుందా? లేదా కొన్ని రోజుల విరామం తరువాత ప్రతిపాదనలు సభ ముందుకు వస్తాయా? అనే విషయమై స్పష్టత రావాల్సివుంది.
Andhra Pradesh
Sambangi
China Appala Naidu
Protem Speaker

More Telugu News