Andhra Pradesh: అమిత్ షా 12 మందిని చంపించాడు.. ఇతనా మన హోంమంత్రి?: సీపీఐ నారాయణ
- షాపై నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయి
- కేంద్ర మంత్రుల్లో 52 మంది కోటీశ్వరులే
- గుంటూరులో మీడియాతో సీపీఐ నేత
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై సీపీఐ నేత నారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దాదాపు 12 మందిని అమిత్ షా ఎన్ కౌంటర్ల ద్వారా చంపించాడని ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆయనపై 4 క్రిమినల్ కేసులు ఉన్నాయని అన్నారు. ఇలాంటి వ్యక్తిని భారత హోంమంత్రిగా నియమించడం నిజంగా దురదృష్టకరమని విమర్శించారు. గుంటూరు జిల్లాలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు.
కేంద్ర కేబినెట్ లో 52 మంది మంత్రులు కోటీశ్వరులేనని నారాయణ అన్నారు. ఇక అమిత్ షాతో పాటు 26 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెబుతూ, దేశాన్ని పాలించేది ఇలాంటి వాళ్లా? అని ఆయన నిలదీశారు. ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల ఈవీఎంలను వాడటం లేదనీ, భారత్ లోనూ వీటిని తొలగించి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ పార్టీలతో బీజేపీ జాగ్రత్తగా ఉండాలని నారాయణ హెచ్చరించారు.