CM jagan: అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పధకం...ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సీఎం జగన్

  • ఏటా 12,500 సాయం ప్రకటన
  • రైతులకు కనీస మద్దతు ధర అందిస్తామని భరోసా
  • ఈరోజు వ్యవసాయ శాఖ సమీక్షలో నిర్ణయం

ఏటా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తానని ఎన్నికల వేళ ప్రకటించిన వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రావడంతోనే మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు వ్యవసాయం, అనుబంధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఖరీఫ్‌, రబీ సీజన్‌కు సంబంధించిన ప్రణాళిక, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. అనంతరం అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతు భరోసా పధకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఏటా 12,500 సాయం అందిస్తామని ప్రకటించారు. అలాగే రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. రైతులకు గిట్టుబాటు ధర అందిస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News