TRS: సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తూ ప్రకటన జారీ చేసిన శాసనసభ కార్యదర్శి
- స్పీకర్‌ని కలిసిన 12 మంది ఎమ్మెల్యేలు
- టీఆర్ఎస్‌లో తమను విలీనం చేయాలని వినతి
- అనూహ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా మారిన ఎంఐఎం
టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం సంపూర్ణంగా ముగిసింది. నేటి మధ్యాహ్నం 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ని కలిసి సీఎల్పీ విలీనం గురించి విజ్ఞప్తి చేస్తూ ఓ లేఖను అందించారు. తామంతా కాంగ్రెస్ నుంచి ఎన్నికయ్యామని ప్రస్తుతమున్న ఎమ్మెల్యేలలో మూడింట రెండొంతుల మంది టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో చేరాలని నిర్ణయించుకున్నందున తమను ఆ పార్టీలో విలీనం చేయాలని లేఖలో కోరారు.
ఈ నేపథ్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్‌ను టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు శాసనసభ కార్యదర్శి ఓ ప్రకటన జారీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ బలం 6కి పడిపోవడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. దీంతో శాసనసభలో 7 స్థానాలున్న ఎంఐఎం అనూహ్యంగా ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది.