RTGS: ఏపీకి ముందస్తు రుతుపవనాలు... ఇక వర్షాలే: ఆర్టీజీఎస్
- నేటి నుంచి విస్తారంగా వర్షాలు
- 11 నాటికి సీమకు నైరుతి
- అంచనా వేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రుతుపవనాలు అనుకున్న సమయంకన్నా ముందుగానే రానున్నాయని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) అంచనా వేసింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. 11, 12 తేదీల్లో నైరుతి రుతుపవనాలు రాయలసీమను తాకుతాయని, ఆపై రెండు రోజుల్లోపే దక్షిణ కోస్తాపై విస్తరిస్తాయని తెలిపింది. ఆలోగానే తెలంగాణకూ నైరుతి వ్యాపిస్తుందని పేర్కొంది. అల్పపీడన ద్రోణి, క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ అధికారి ఒకరు తెలియజేశారు.