aviation: స్వల్పంగా పెరగనున్న విమాన ప్రయాణ ధరలు.. కొత్తగా ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు
- ప్యాసింజరు సర్వీస్ ఫీజుకు బదులుగా విధింపు
- ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం
- జూలై ఒకటి నుంచి అమల్లోకి
దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న ప్యాసింజరు సర్వీస్ ఫీజుకు బదులుగా ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు(ఏఎస్ఎఫ్)ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం ఇందుకు కారణం. ఈ విధానంలో వచ్చేనెల ఒకటి నుంచి అమల్లోకి రానుంది.
ప్రస్తుతం దేశీయ ప్రయాణికుల నుంచి ప్యాసింజర్ సర్వీస్ ఫీజు (పీఎస్ఎఫ్) రూ.130 రూపాయలు వసూలు చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారికి ప్రస్తుతం 3.25 డాలర్లు (దాదాపు 211 రూపాయలు) వసూలు చేస్తున్నారు. దీనికి బదులుగా విమాన భద్రతా రుసుము (ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు) వసూలు చేస్తారు. దేశీయ ప్రయాణికుల నుంచి దీన్ని రూ.150గాను, విదేశీ ప్రయాణికుల నుంచి 4.85 డాలర్లకు (అంటే 315 రూపాయను) వరకు వసూలు చేయనున్నారు. తాజా మార్పు వల్ల ప్రయాణికుల టికెట్టు ఖర్చులు పెరగనున్నాయి.