mig 29k: మిగ్ విమానం నుంచి విడిపోయిన డ్రాప్ ట్యాంక్.. గోవా విమానాశ్రయం మూసివేత
- మిగ్ విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఘటన
- విమానాశ్రయంలో దట్టంగా అలుముకున్న పొగలు
- కొన్ని గంటల పాటు మూతపడ్డ విమానాశ్రయం
గోవా విమానాశ్రయం తాత్కాలికంగా మూత పడింది. విమానాశ్రయం నుంచి యుద్ధ విమానం మిగ్-29కే టేకాఫ్ అవుతున్న సమయంలో... దానికి ఉన్న డ్రాప్ ట్యాంక్ విడిపోయింది. అందులో ఉన్న ఇంధనం మండటంతో విమానాశ్రయంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో విమానాశ్రయాన్ని కొన్ని గంటల సేపు తాత్కాలికంగా మూసివేశారు. విమానాశ్రయ అధికారులు, సిబ్బంది వెనువెంటనే చర్యలు చేపట్టడంతో... కాసేపటి క్రితమే విమానాల రాకపోకలు పున:ప్రారంభమయ్యాయి. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు.