Mekatoti Sucharitha: ఏపీ హోంమంత్రిగా మేకతోటి సుచరిత... కొత్త మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే!
- పుష్పశ్రీవాణికి గిరిజన సంక్షేమ శాఖ
- మున్సిపల్, పట్టణాభివృద్ధి మంత్రిగా బొత్స
- ధర్మానకు రోడ్లు, భవనాల శాఖ కేటాయింపు
నవ్యాంధ్రప్రదేశ్ లో ఇవాళ కొత్త క్యాబినెట్ కొలువుదీరింది. రాష్ట్ర నూతన హోంమంత్రిగా మేకతోటి సుచరిత నియమితులయ్యారు. సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసే 25 మందితో కూడిన నూతన క్యాబినెట్ ఈ ఉదయం వెలగపూడి సచివాలయం వద్ద ప్రమాణస్వీకారం చేసింది. కాగా, కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ఆమోదం తెలిపారు.
ఏపీ మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు
- మేకతోటి సుచరిత - హోంశాఖ
- పాముల పుష్పశ్రీవాణి- గిరిజన సంక్షేమం
- ధర్మాన కృష్ణదాస్ - రోడ్లు, భవనాల శాఖ
- బొత్స సత్యనారాయణ - మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
- అవంతి శ్రీనివాస్ - పర్యాటక శాఖ, కల్చరల్ యూత్ అడ్వాన్స్ మెంట్
- మేకపాటి గౌతంరెడ్డి- పరిశ్రమలు, వాణిజ్యశాఖ
- అనిల్ కుమార్ యాదవ్ - జలవనరులు, నీటిపారుదల శాఖ
- కురసాల కన్నబాబు - వ్యవసాయం, సహకార శాఖ
- తానేటి వనిత - మహిళా శిశుసంక్షేమం
- కొడాలి నాని - పౌరసరఫరాల శాఖ
- మోపిదేవి వెంకటరమణ - పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్
- పినిపె విశ్వరూప్ - సాంఘిక సంక్షేమ శాఖ
- ఆళ్ల నాని - వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ
- పిల్లి సుభాష్ చంద్ర బోస్ - రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్
- వెల్లంపల్లి శ్రీనివాస్ - దేవాదాయ శాఖ
- గుమ్మనూరి జయరాం - కార్మిక, ఉపాధి శాఖ
- బాలినేని శ్రీనివాసరెడ్డి - విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ
- ఆదిమూలపు సురేశ్ - విద్యాశాఖ
- పెద్దిరెడ్డి - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖ
- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి - ఆర్థిక, ప్రణాళిక, అసెంబ్లీ వ్యవహారాలు
- అంజాద్ భాషా - మైనారిటీ వ్యవహారాల శాఖ
- నారాయణస్వామి - ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ
- శంకర్ నారాయణ - బీసీ సంక్షేమ శాఖ
- శ్రీరంగనాథరాజు - గృహనిర్మాణశాఖ
- పేర్ని నాని - రవాణా, సమాచార శాఖ