Subrahmanyam: ఆ వాస్తవాలన్నింటినీ జగన్‌కు అర్థమయ్యేలా వివరించండి: సీఎస్‌కు కేంద్ర ఇంధన శాఖ లేఖ

  • పారిశ్రామికాభివృద్ధికి మంచిది కాదు
  • పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బ తీస్తుంది
  • మళ్లీ పెట్టుబడులు పెట్టాలన్నా భయపడతారు
  • గత ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందే

2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాదక శక్తి సాధించాలనేది కేంద్రం లక్ష్యమని, ఇలాంటి సమయంలో ఏపీ విద్యుత్ కొనుగోలుపై పున:పరిశీలన జరపడం సరికాదని కేంద్ర ఇందన శాఖ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది. అవసరమైతే టీడీపీ ప్రభుత్వ హాయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేస్తామంటూ ఏపీ సీఎం జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర ఇందన శాఖ స్పందించింది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి ఆనందకుమార్, ఏపీ సీఎస్ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున: పరిశీలన చేయడం పారిశ్రామికాభివృద్ధికి మంచిది కాదని, అది పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బ తీస్తుందని ఆనందకుమార్ లేఖలో పేర్కొన్నారు.

పెట్టుబడిదారులు భవిష్యత్తులో మళ్లీ పెట్టుబడులు పెట్టాలన్నా భయపడతారని తెలిపారు. మితిమీరిన లబ్ది చేకూరడమో లేదంటే ఒప్పందాల్లో కుట్ర జరిగిందని రుజువైతే తప్ప ఒప్పందాలను పున:పరిశీలన చేయకూడదని, గత ఒప్పందాలకు కట్టుబడి ఉండాల్సిందేనని లేఖలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఏ ఒప్పందమైనా సెంట్రల్ ఎలక్ట్రిసిటి రెగ్యులేటరి కమిషన్ నిబంధనల ప్రకారం, బహిరంగ వేలం ద్వారా జరుగుతాయని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వాస్తవాలన్నింటినీ ముఖ్యమంత్రి జగన్‌కు అర్థమయ్యేలా వివరించాలని సీఎస్‌కు ఇందన శాఖ సూచించింది.

  • Loading...

More Telugu News