Jagan: నాడు తండ్రితో, నేడు కొడుకుతో... ఈ ఆరుగురు మంత్రులూ స్పెషల్!
- వైఎస్ క్యాబినెట్ లో బొత్స, పిల్లి సుభాష్ చంద్ర బోస్, మోపిదేవి
- పెద్దిరెడ్డి, బాలినేని, విశ్వరూప్ కూడా
- వారిని తీసుకున్న వైఎస్ జగన్
జగన్ క్యాబినెట్ లోని ఆరుగురు మంత్రులు నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలోనూ పనిచేశారు. అప్పట్లో తండ్రి హయాంలో మంత్రులుగా ఉన్నవారిలో వీరిని జగన్ తన మంత్రివర్గంలోనూ చేర్చుకున్నారు. బొత్స సత్యనారాయణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డిలు వైఎస్ హయాంలోనూ మంత్రులుగా పనిచేశారన్న సంగతి తెలిసిందే. వీరు ఆరుగురూ ఇప్పుడు జగన్ క్యాబినెట్ లోనూ ఉన్నారు. వీరికి కీలక శాఖలు దక్కాయి.
కాగా, బొత్స సత్యనారాయణకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖలు, మోపిదేవి వెంకటరమణకు పశుసంవర్ధకశాఖ, మార్కెటింగ్ శాఖలు, విశ్వరూప్ కు సాంఘిక సంక్షేమ శాఖ, పిల్లి సుభాష్ చంద్ర బోస్ కు రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖలు, బాలినేని శ్రీనివాసరెడ్డికి విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు దక్కాయన్న సంగతి తెలిసిందే.