Telangana: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల... తొలి ర్యాంక్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి!

  • తాడేపల్లి గూడెంకు చెందిన రవిశ్రీ తేజ
  • టీఎస్ ఇంజనీరింగ్ లో తొలిర్యాంకు
  • ఫలితాలు విడుదల చేసిన తుమ్మల పాపిరెడ్డి

తెలంగాణ  ఎంసెట్‌ ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇంజనీరింగ్‌లో తొలి ర్యాంక్‌ ను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన రవిశ్రీ తేజ దక్కించుకున్నాడు. ఇంటర్ వెయిటేజ్ మార్కులు కలపాల్సివున్న కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యం అయిందని ఈ సందర్భంగా పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1,42,216 మంది విద్యార్థులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఎంసెట్ ఆన్ లైన్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 1,31,209 మంది హాజరయ్యారని తెలిపారు.
 
ఇంజనీరింగ్ లో టాప్ 10 ర్యాంకర్లు వరుసగా కురిచేటి రవి శ్రీతేజ (తాడేపల్లిగూడెం), చంద్రశేఖర్‌ (హైదరాబాద్‌), ఆకాశ్‌ రెడ్డి (హైదరాబాద్‌), కార్తికేయ (హైదరాబాద్‌), భాను దత్తా (భీమవరం), సాయి వంశీ (హైదరాబాద్‌), సాయి విజ్ఞాన్‌ (హైదరాబాద్‌), ఐతేంద్ర కశ్యప్‌ (గిద్దలూరు), వేద ప్రణవ్‌ (హైదరాబాద్‌), అప్పకొండ అభిజిత్‌ రెడ్డి (హైదరాబాద్‌).

ఇక అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి వస్తే, టాప్ 10 ర్యాంకర్లుగా కుశ్వంత్‌ (భూపాలపల్లి), దాసరి కిరణ్‌ కుమార్‌ (రాజమండ్రి), వెంకట సాయి తేజ (కాకినాడ), సుంకర సాయి స్వాతి (తిరుపతి), అక్షయ్‌ (హైదరాబాద్‌), మోనిష ప్రియ (తమిళనాడు), బుర్రా శివాని శ్రీవాత్సవ (నిజామాబాద్‌), సిద్ధార్థ భరద్వాజ్‌ (విశాఖపట్నం), పూజ (తిరుపతి), హశిత (హైదరాబాద్‌) ఉన్నారు.

  • Loading...

More Telugu News