Anchor Rashmi: సరైన దుస్తులు ధరిస్తే నేరాలు తగ్గించవచ్చంటూ ఓ నెటిజన్ హిత బోధ చేయబోతే.. మండిపడ్డ రష్మి!
- పొట్టి దుస్తులు ధరించడం వల్లే అత్యాచారాలు
- కాస్త ఆలోచించమంటూ రష్మికి ట్వీట్
- నువ్వు జన్మించడమే పెద్ద నేరమంటూ రష్మి ట్వీట్
సరైన దుస్తులు ధరించకపోవడం వల్లే అమ్మాయిలు అత్యాచారాలకు గురవుతున్నారంటూ ప్రముఖ యాంకర్ రష్మికి హిత బోధ చెయ్యబోతే ఆమె రివర్స్ అయింది. ఘాటుగా స్పందిస్తూ రిప్లై ఇచ్చింది. ఓ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా రవిక లేకుండా చీర ధరించి ఫోటో షూట్‌లో పాల్గొంది. ఇది బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరు ఆమెను సమర్థిస్తూ ట్వీట్స్ పెడితే, కొందరు ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రియాంకకు మద్దతుగా ఓ వెబ్‌సైట్, పూర్వకాలం నుంచి రవిక లేని చీరకట్టు ఉందంటూ కథనాన్ని ప్రచురించింది.
ఈ కథనాన్ని రష్మి రీ ట్వీట్ చేసింది. దీనిపై స్పందించిన ఓ నెటిజన్, రష్మికి ట్యాగ్ చేస్తూ, అలాంటివి ధరించడం వల్ల ఉపయోగం లేదని, అమ్మాయిలు పొట్టి దుస్తులు ధరించడం వల్లే అత్యాచారాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. సరైన దుస్తులు ధరిస్తే నేరాలను తగ్గించవచ్చని, కాస్త ఆలోచించమంటూ హితవు పలికాడు. ఈ ట్వీట్‌ని చూసిన రష్మి ఇలాంటి ఆలోచనలున్న నువ్వు జన్మించడమే పెద్ద నేరమంటూ విరుచుకు పడింది. దీంతో తన ట్వీట్‌ను డిలీట్ చేసిన నెటిజన్, రష్మికి తానేమీ వ్యతిరేకం కాదని, కొన్ని సందర్భాల్లో ఇలా కూడా జరిగే అవకాశముందని తాను నిజం చెబుతున్నానని, బాధ పెట్టి ఉంటే క్షమించమని పేర్కొన్నాడు.