Vijayanagaram District: దాతృత్వంలో ధనికుడనేనని చాటుకున్న బిచ్చగాడు!
- ఆలయాల అభివృద్ధికే వితరణ
- యాచకుడి దాన గుణం ఇది
- విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దానకర్ణుడు
దానం చేసేందుకు కోటేశ్వరుడే అయి ఉండక్కర్లేదు. దాతృత్వం ఉన్న మనసుంటే
చాలు. ఇందుకు ఈ యాచకుడే ఉదాహరణ. ఏ ఆలయం ముందైతే తాను భిక్షాటన చేసుకుంటున్నాడో ఆ ఆలయం అభివృద్ధికి లక్ష రూపాయలు విరాళంగా అందించి, దాతృత్వంలో తాను ధనికుడనేని చాటుకున్నాడు.
వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం ఒప్పంగి గ్రామానికి చెందిన చేబోలు కామరాజు అరవై ఏళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం విజయనగరం జిల్లా చీపురుపల్లి వచ్చాడు. అక్కడే స్థిరపడిపోయాడు. జీవితం ఏదోలా సాగిపోతుందనుకునే సమయంలో కొన్నేళ్ల క్రితం అతని రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. దిక్కుతోచని పరిస్థితుల్లో చీపురుపల్లిలోని నీలకంఠేశ్వరస్వామి ఆలయం ముందు యాచకునిగా జీవితాన్ని ప్రారంభించాడు.
ఇలా రూపాయి రూపాయి కూడబెట్టాడు. ఆ విధంగా కూడబెట్టిన మొత్తం రూ.3 లక్షల ఐదు వేల రూపాయలను ఏ గుడి ముందైతే తాను భిక్షాటన చేసుకుంటున్నాడో ఆ గుడి అభివృద్ధికే విరాళంగా అందించాడు. ఇటీవలే మరో 30 వేల రూపాయలు పట్టణంలోని రావివలస కూడలి సమీపంలోని భారీ ఆంజనేయస్వామి విగ్రహం వద్ద భక్తుల సౌకర్యార్థం షెడ్డు నిర్మాణానికి అందజేశాడు.