Sucharitha: ఏపీ మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు పూర్తి

  • హోమంత్రి సుచరితకు 2వ బ్లాక్‌లోని 136 కేటాయింపు 
  • ఆర్థిక శాఖా మంత్రికి 2వ బ్లాక్‌లోని 212వ నంబర్ గది
  • ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి 3వ బ్లాకులో కేటాయింపు
వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో మంత్రులకు ఛాంబర్ల కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. రెండో బ్లాక్‌లోని 135వ నంబర్ గదిని మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు,136ను హోంమంత్రి మేకతోటి సుచరితకు, 137ను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు, 208ని వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబుకు, 210ని పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌కు, 211ని  విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి, 212ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌కు కేటాయించారు.

మూడో బ్లాక్‌ విషయానికి వస్తే, గది నంబర్‌ 203ను ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్ప శ్రీవాణికి కేటాయించారు. 207ను కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరామ్‌కు, 211ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు, 212ను మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అంజద్‌ బాషాకు కేటాయించారు.

నాలుగో బ్లాక్‌లోని గది నంబర్‌ 127ను ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామికి కేటాయించారు. 130ని పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నానికి, 131ని బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎం.శంకరనారాయణకు, 132ని మత్స్యశాఖ మంత్రి వెంకటరమణకు, 208ని ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి, 210ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కు, 211ని గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజుకు, 212ని జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు కేటాయించారు.  

ఐదో బ్లాక్‌లోని 188వ నంబర్ గదిని పంచాయతీ రాజ్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, 191ని ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నానికి, 193ని రోడ్లు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు, 210ని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు, 211ను రవాణా, సమాచార శాఖమంత్రి పేర్ని నానికి కేటాయించారు.

Sucharitha
Pushpa Srivani
Kanna Babu
Balineni Srinivasa Reddy
Rajendra Prasad
Viswaroop
Amjad Basha

More Telugu News