Congress: నేను కేసులు పెట్టడం మొదలెడితే మీడియా సంస్థలకు సిబ్బంది కొరత వచ్చేస్తుంది!: రాహుల్ గాంధీ
- యూపీలో జర్నలిస్టు, ఎడిటర్ అరెస్ట్
- పోలీసుల చర్యను ఖండించిన కాంగ్రెస్ చీఫ్
- వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఓ మహిళ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన జర్నలిస్టును యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు మరో మీడియా సంస్థ ఎడిటర్ పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వెటకారంగా స్పందించారు.
‘నాపై బీజేపీ, ఆరెస్సెస్ అనుకూల మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారం విషయంలో జర్నలిస్టులపై కేసులు పెడుతూ పోతే చాలా వార్తా పత్రికలకు, మీడియా ఛానళ్లకు సిబ్బంది కొరత వచ్చేస్తుంది. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలి’ అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.