Bhupen Khakhar: రికార్డు సృష్టించిన భూపేన్ పెయింటింగ్.. రూ.22 కోట్లు పలికిన ‘గే లవ్’ చిత్రం!
- 1985-86లో తొలిసారి ఈ పెయింటింగ్ ప్రదర్శన
- సౌత్‌బే వేలంలో రికార్డుస్థాయి ధర
- తన లైంగిక ధోరణిని పెయింటింగ్ ద్వారా బయటపెట్టిన భూపేన్
సమకాలీన భారతీయ చిత్రకారుడు భూపేన్ ఖాఖర్ 1980లలో వేసిన ‘గే లవ్’ పెయింటింగ్‌కు రికార్డు ధర పలికింది. ‘టు మెన్ ఇన్ బెనారస్’ పేరుతో చిత్రించిన ఈ పెయింటింగ్‌కు లండన్‌లోని సోత్బే వేలంలో రూ.22 కోట్ల ధర పలికింది. ఓ పెయింటర్ చిత్రానికి ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. ఈ చిత్రంలో ఇద్దరు పురుషులు నగ్నంగా కౌగిలించుకుని ఉంటారు. ఖాఖర్ 1985-86లలో ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. ఓ భారతీయ చిత్రకారుడు తన లైంగిక ధోరణిని పెయింటింగ్ ద్వారా బయటపెట్టడం ఇదే తొలిసారి. 1934లో జన్మించిన ఖాఖర్ 2003లో కన్నుమూశారు.