Andhra Pradesh: భారత అభివృద్ధిని బాలకార్మిక వ్యవస్థ ప్రశ్నిస్తూనే ఉంది.. ఇది నిజంగా బాధాకరం!: వెంకయ్య నాయుడు
- పేదరికం, నిరక్షరాస్యతను మనం అధిగమించాలి
- ఇందుకోసం ప్రతీఒక్కరూ ప్రతినబూనాలి
- ట్విట్టర్ లో స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
బాలకార్మిక వ్యవస్థ నేటికీ దేశాభివృద్ధిని ప్రశ్నిస్తూనే ఉండటం బాధాకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పేదరికం, నిరక్షరాస్యత వంటి సవాళ్లను అధిగమించడమే ఈ సమస్యలకు పరిష్కారమని వ్యాఖ్యానించారు. నేడు అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతీఒక్కరూ ఈ దిశగా ప్రతినబూనాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కేవలం కఠినమైన చట్టాలు చేస్తే సరిపోదని వెంకయ్య అన్నారు. సంక్లిష్టమైన ఈ సమస్యను పరిష్కరించేందుకు స్థిరమైన, దీర్ఘకాలిక కృషి అవసరమని స్పష్టం చేశారు. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం స్వచ్ఛంద సేవాసంస్థలు, విద్యాసంస్థలు, యువత ముందుకు రావాలని వెంకయ్య ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.