chevireddy: అప్పుడు మీరు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పండి.. నేను కూడా క్షమాపణ చెబుతాను: చెవిరెడ్డి

  • గతంలో వైయస్ ను టీడీపీ వాళ్లు రాక్షసుడు అన్నారు
  • వారి మాటలకు వారు క్షమాపణ చెప్పాలన్న చెవిరెడ్డి
  • బంట్రోతు అన్న చెవిరెడ్డి వ్యాఖ్యలతో దద్దరిల్లిన సభ

స్పీకర్ ను ఛైర్ లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తన బంట్రోతును పంపించారంటూ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో వేడి పుట్టించాయి. అధికార, విపక్ష నేతల అరుపులతో సభ దద్దరిల్లింది. ఈ సందర్బంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, గతంలో ఇదే సభలో టీడీపీ సభ్యులు దివంగత నేత రాజశేఖరరెడ్డిని రాక్షసుడు అన్నారని... ఆనాడు వారు చేసిన వ్యాఖ్యలకు వారు క్షమాపణ చెప్పాలని... అప్పుడే తాను చేసిన వ్యాఖ్యలకు తాను కూడా క్షమాపణ చెబుతానని అన్నారు. మరోవైపు, ఈ అంశంపై స్పీకర్ మాట్లాడుతూ, రికార్డులు చూసిన తర్వాత దీనిపై రూలింగ్ ఇస్తానని చెప్పారు. చర్చ ముగిసిన తర్వాత ప్రజాప్రతినిధులందరికీ స్పీకర్ ధన్యవాదాలు తెలిపారు. సభను రేపటికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News