sensex: కుదేలైన యస్ బ్యాంక్.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- 15 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 8 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 13 శాతం వరకు నష్టపోయిన యస్ బ్యాంక్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఒకానొక దశలో సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ 78 పాయింట్ల మేర నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత కోలుకున్నాయి. ముడి చమురు ధర పెరగడమే దీనికి కారణం. మరోవైపు యస్ బ్యాంక్ షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. బ్యాంకు ప్రైస్ విలువను యూబీఎస్ సగానికి సగం తగ్గించడంతో షేర్ల విలువ పతనమైంది. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 15 పాయింట్ల నష్టంతో 39,741కు పడిపోయింది. నిఫ్టీ 8 పాయింట్లు లాభపడి 11,914కు చేరింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.54%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.33%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.33%), భారతి ఎయిర్ టెల్ (0.96%), యాక్సిస్ బ్యాంక్ (0.90%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-12.96%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.96%), ఇన్ఫోసిస్ (-1.49%), మారుతి సుజుకి (-1.03%), వేదాంత లిమిటెడ్ (-1.03%).