ys viveka: వైఎస్ వివేకా హత్య కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు
- పులివెందుల కోర్టు ఆదేశాలు
- ఈ నెల 28 వరకు రిమాండ్ విధింపు
- నిందితులను పులివెందుల సబ్ జైలుకు తరలింపు
వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకు రిమాండ్ విధించారు. ఈ మేరకు పులివెందుల కోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల మేరకు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్ ను పోలీసులు పులివెందుల సబ్ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా, వైఎస్ వివేకా హత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఇటీవల సీఎం జగన్ ని ఆయన కుమార్తె సునీత కోరారు.