Karnataka: స్వతంత్ర అభ్యర్థిగా గెలుపు నాపై బాధ్యత పెంచింది: మాండ్యా ఎంపీ సుమలత

  • లోక్ సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసిన సుమలత
  • రాజ్యాంగపరంగా స్వతంత్ర ఎంపీ ఏ పార్టీలో చేరకూడదు
  • మహిళా సమస్యలపై నా గళం విప్పుతా
కర్ణాటకలోని మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నటి సుమలతా అంబరీశ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. లోక్ సభలో ఎంపీగా ఈరోజు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, పార్లమెంట్ ప్రాంగణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, స్వతంత్ర అభ్యర్థిగా సాధించిన గెలుపు తనపై బాధ్యతను పెంచిందని అన్నారు. రాజ్యాంగపరంగా స్వతంత్ర ఎంపీ ఏ పార్టీలో చేరకూడదని చెప్పిన ఆమె, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తనకు ఎలాంటి విముఖత లేదని స్పష్టం చేశారు.

పార్లమెంట్ వేదికగా మహిళా సమస్యలపై తన గళం విప్పుతానని, వాటి పరిష్కారానికి పోరాడతానని అన్నారు. తెలుగునేల తన పుట్టిల్లు అని, కర్ణాటక తన అత్తారిల్లు అని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఆమె మాట్లాడుతూ, ఈ విషయమై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు.
Karnataka
Mandya
mp
sumalatha

More Telugu News