Om Birla: లోక్ సభ స్పీకర్ గా ఓమ్ బిర్లా... ఖరారు చేసిన మోదీ-షా!
- రాజస్థాన్ నుంచి గెలిచిన కోటా
- ఎన్డీయే తరఫున నామినేషన్
- విజయం సులభమే
17వ లోక్ సభాపతిగా రాజస్థాన్, కోటా నుంచి గెలిచిన ఓమ్ బిర్లాను నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం ఎంచుకుంది. లోక్ సభ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కాగా, స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఓమ్ ప్రకాశ్, ఎన్డీయే తరఫున నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన, కాంగ్రెస్ కు చెందిన రామ్ నారాయణ్ మీనాపై 2.50 లక్షల ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించారు.
కాగా, తన భర్త లోక్ సభకు స్పీకర్ గా ఎన్నిక కానుండటం తనకెంతో గర్వంగా వుందని ఓమ్ బిర్లా భార్య అమిత్ బిర్లా వ్యాఖ్యానించారు. తన భర్తను ఇంతటి కీలక పదవికి ఎంచుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, క్యాబినెట్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. కాగా, 16వ లోక్ సభలో స్పీకర్ గా వ్యవహరించిన సుమిత్రా మహాజన్, గత ఎన్నికల్లో పోటీ చేయలేదన్న సంగతి తెలిసిందే. సభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఓమ్ బిర్లా విజయానికి ఎటువంటి అడ్డంకులూ కలిగే పరిస్థితి లేదు.