Andhra Pradesh: ఎన్నికలకు ముందే వేరే పార్టీ.. ఈ పార్టీ అన్న భావన.. ఆ తర్వాత అందరూ మనవాళ్లే: సీఎం వైఎస్ జగన్

  • ప్రతి ప్రభుత్వ పథకం ప్రజలకు నేరుగా డోర్ డెలివరీ
  • పథకాల అమలులో అవినీతి, అన్యాయం జరగకూడదు 
  • అవినీతి జరిగితే నేరుగా సీఎం ఆఫీసుకే ఫోన్ చేయచ్చు  

ప్రతి ప్రభుత్వ పథకం ప్రజలకు నేరుగా డోర్ డెలివరీ చేసే దిశగా ప్రయత్నం చేస్తామని  సీఎం జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలులో ఎక్కడా అవినీతి, అన్యాయం జరగకూడదని అన్నారు. అర్హత ఉన్న వ్యక్తికి పథకం ప్రయోజనాలు పొందకపోయినా, గ్రామ వాలంటీర్ అవినీతికి పాల్పడినా నేరుగా సీఎం కార్యాలయానికే ఫోన్ చేయొచ్చని, కాల్ సెంటర్ ను సీఎం ఆఫీసులోనే ఏర్పాటు చేయమని చెబుతున్నానని అన్నారు. కులమతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలని, ఎన్నికలకు ముందే వేరే పార్టీ.. ఈ పార్టీ అన్న ఆలోచన తప్ప, ఆ తర్వాత అందరూ మనవాళ్లేనన్న ఆదేశాలు జారీ చేస్తున్నానని అన్నారు. 

  • Loading...

More Telugu News