sensex: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
- 86 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 19 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 6 శాతం వరకు నష్టపోయిన యస్ బ్యాంక్
వరుసగా నాలుగు రోజుల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ గాడిలో పడ్డాయి. 491 పాయింట్ల నష్టంతో నిన్న సెన్సెక్స్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్ల లాభంతో 39,046కు పెరిగింది. నిఫ్టీ 19 పాయింట్లు పుంజుకుని 11,691 వద్ద స్థిరపడింది. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్, ఎస్బీఐ వంటి దిగ్గజ సంస్థలు మార్కెట్లను ముందుండి నడిపించాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
వేదాంత లిమిటెడ్ (2.47%), కోల్ ఇండియా (2.02%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (1.88%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.88%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.57%).
టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-5.94%), మారుతి సుజుకి (-2.20%), ఏషియన్ పెయింట్స్ (-1.53%), సన్ ఫార్మా (-1.11%), హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (-0.79%).