paruchuri: 'కర్తవ్యం' సినిమా విషయంలో అలా జరిగింది: పరుచూరి గోపాలకృష్ణ

  • విజయశాంతిని తొలిసారిగా అక్కడ చూశాను
  • ఎ.ఎం. రత్నం కోరడంతో కథ రాశాము
  •  క్లైమాక్స్ ను మార్చడం జరిగింది

తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో విజయశాంతిని గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "1981లో చెన్నై లోని విజయ వాహిని స్టూడియోలో నేను విజయశాంతిని తొలిసారి చూశాను. ఆమెను హీరోయిన్ గా పరిచయం చేయమని అక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు ఆమె వయసు 14- 15 సంవత్సరాలు ఉంటాయి.

ఆ రోజున చాలా చిన్నపిల్లగా కనిపించిన విజయశాంతి, ఆ తరువాత సంచలనాలు సృష్టించింది. మేము శారద గారితో 'ప్రతిధ్వని' చేసిన తరువాత, అలాంటి కథ ఒకటి విజయశాంతికి రాయమని నిర్మాత ఎ.ఎం.రత్నంగారు అడగడం మొదలుపెట్టారు. ఆ తరువాత నేను 'కర్తవ్యం' సినిమా కథ రాశాను. కథ పూర్తయిన తరువాత 'మీనా' పాత్రను జోడించడం జరిగింది. ఆ తరువాత విజయశాంతి పాత్రను హైలైట్ చేయడం కోసం క్లైమాక్స్ ను మార్చడం జరిగింది. ఈ సినిమా ఎంతటి సంచలనానికి తెరతీసిందో తెలిసిందే" అన్నారాయన.   

  • Loading...

More Telugu News