Andhra Pradesh: ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు!
- కోస్తాంధ్రకు దగ్గరగా ఉపరితల ఆవర్తనం
- ఉరుములతో భారీ వర్షాలకు చాన్స్
- వెల్లడించిన వాతావరణ శాఖ అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్రలో తీరానికి దగ్గరగా 4.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని వెల్లడించిన అధికారులు, దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపారు.
పగటి ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ, రాత్రి వేళల్లో మాత్రం సాధారణ స్థాయితో పోలిస్తే, 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, మరో రెండు వారాలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అన్నారు. ఏపీ, టీఎస్ లోకి ఇంకా నైరుతీ రుతుపవనాలు ప్రవేశించలేదని, మరో 3 రోజుల్లో రుతుపవనాలు రావచ్చని అంచనా వేశారు. తొలుత ఏపీకి, ఆపై తెలంగాణలోకి రుతుపవనాలు వస్తాయని, అందుకు ఐదారు రోజులు పట్టవచ్చని వెల్లడించారు.